తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని నిత్యాన్నదానానికి ప్రముఖ పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత, భవ్య సంస్థల అధినేత వి. ఆనందప్రసాద్ రూ. కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. నేడు (జూలై 7, బుధవారం) తిరుమలలో అడిషనల్ ఈవో శ్రీ ధర్మారెడ్డిని కలిసిన ఆనందప్రసాద్, కృష్ణకుమారి దంపతులు కోటి రూపాయల చెక్కును అందజేశారు. టీటీడీకి గతంలోనూ ఆనందప్రసాద్ రూ. కోటి విరాళం ఇచ్చిన విషయం విధితమే.