ఎన్నో అద్భుతమైన పాటలు రాసిన వైరముత్తుకు తాజాగా 'ఓఎన్ వీ లిటరరీ అవార్డ్' ప్రకటించారు. ఈ అవార్డ్ 2016లో మరణించిన లెజెండ్రీ రైటర్ 'ఓఎన్ వీ కురుప్' పేరు మీదుగా ప్రతి ఏటా ఇస్తుంటారు. కానీ, ఈ సంవత్సరం వైరముత్తుకు ప్రతిష్ఠాత్మక సాహిత్య పురస్కారం ప్రకటించటం చాలా మందికి ఆగ్రహం తెప్పించింది. ఎందరో తీవ్రమైన ఆరోపణలు చేసిన ఒక వ్యక్తికి అంతటి అవార్డ్ ఎలా ఇస్తారంటూ సోషల్ మీడియాలో నిరసనలు తెలుపుతున్నారు.
పార్వతీ అనే తమిళ నటి ఇన్‌స్టాగ్రామ్‌లో వైరముత్తును తీవ్రంగా విమర్శించింది. ఓఎన్‌వీ కురుప్ ఒక రచయితగా తమిళ సంస్కృతిని ఎంతో సుసంపన్నం చేశారు. అటువంటి గొప్ప రైటర్, లిరిస్ట్ పేరున ఏర్పాటు చేసిన అవార్డ్ లైంగిక వేధింపు ఆరోపణలు ఎదుర్కొంటోన్న వారికి ఎలా ఇస్తారని ఆమె ప్రశ్నించింది.
డైరెక్టర్ అంజలి మెనన్, ఫిల్మ్ మేకర్ గీతూ మోహన్ దాస్, నటి రీమా కల్లింగల్, సింగర్ చిన్మయి శ్రీపాద కూడా వైరముత్తుకు వ్యతిరేకంగా తమ నిరసనల్ని గట్టిగానే వినిపించారు. జరుగుతోన్న పరిణామాల దృష్ట్యా ఓఎవన్‌వీ అవార్డ్ ప్రకటించిన జ్యూరి ప్రస్తుతం వైరముత్తు పేరును పునః పరిశీలిస్తోందని సమాచారం. ఆయనకు ప్రకటించిన అవార్డును వెనక్కి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయట.