ఉమెన్స్ డే : మహిళలకు 'వకీల్ సాబ్' పవన్ గిఫ్ట్

శుక్రవారం, 6 మార్చి 2020 (19:09 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "వకీల్ సాబ్". బాలీవుడ్ చిత్రం 'పింక్‌'కు ఈ చిత్రం రీమేక్. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, బోనీ కపూర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే మే నెలలో ప్రేక్షకుల ముందుకురానుంది. 
 
ఈ నేపథ్యంలో ఈ నెల 8వ తేదీ ఆదివారం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళల కోసం తొలి సాంగ్‌ను రిలీజ్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ పాటకు సంబంధించిన ప్రోమోను మూవీ యూనిట్ శుక్రవారం రిలీజ్ చేసింది. 
 
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8వ తేదీ ఉదయం 10 గంటలకు 'మగువ మగువ' సాంగ్‌ను విడుదల చేస్తున్నట్టు చెప్పింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ 'మగువ మగువ' సాంగ్ ప్రోమోను విడుదల చేసింది. 'మగువ మగువ లోకానికి తెలుసు నీ విలువ.. మగువ మగువ నీ సహనానికి సరిహద్దులు కలవా..' అంటా సాగే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించగా, సిద్ శ్రీరామ్ ఆలపించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు