బన్నీకి కలిసొచ్చిన ఆ సెంటిమెంట్, పవన్‌కి కలిసొస్తుందా?

గురువారం, 5 మార్చి 2020 (17:42 IST)
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తాజా సంచలనం అల.. వైకుంఠపురములో. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన అల.. వైకుంఠపురములో సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణతో సంచలన విజయం సాధించింది. సరికొత్త రికార్డులు సొంతం చేసుకుంది. 
 
ఈ సినిమా ఇంతటి విజయాన్ని సాధించడానికి మరో కారణం.. ఈ సినిమాకి ముందు బన్నీ నటించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఫ్లాప్ అయ్యింది. దీంతో ఆలోచనలోపడ్డ బన్నీ ఈసారి చేసే కథతో ఖచ్చితంగా విజయం సాధించాలి అనుకుని చాలా కథలు విన్నారు. 
 
ఆఖరికి త్రివిక్రమ్ చెప్పిన అల.. వైకుంఠపురములో కథను ఫైనల్ చేయడం.. సినిమా రిలీజ్ చేయడం తెలిసిందే. దాదాపు సంవత్సరంన్నర గ్యాప్ రావడంతో బన్నీ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూసారు. 
 
దీంతో అల.. వైకుంఠపురములో సినిమా రిలీజ్ కాగానే బన్నీ సినిమా చూడటం కోసం అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు సైతం థియేటర్స్ వైపు పరుగులు తీసారని చెప్పచ్చు. ఇలా.. గ్యాప్ అనేది బన్నీకి బాగా కలిసొచ్చింది. 
 
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే... మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి అనే సినిమా చేసారు. ఈ సినిమా సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయినప్పటికీ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. 
 
ఆ తర్వాత పవన్ సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వెళ్లడం.. ఇప్పుడు మళ్లీ వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుండడం తెలిసిందే. ఈ చిత్రానికి ఏంసీఎ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 
 
రీసెంట్‌గా వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఈ ఫస్ట్ లుక్ ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటివరకు ఏ సినిమా ఫస్ట్ లుక్‌కి రానంత క్రేజ్ ఈ ఫస్ట్ లుక్ రావడం విశేషం. 
 
బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్‌తో కలిసి టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మే 15న ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సంచలన చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
 
దాదాపు రెండు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా కావడంతో వకీల్ సాబ్ మూవీ పైన అటు అభిమానుల్లోను ఇటు ఇండస్ట్రీలోను భారీ అంచనాలు ఉన్నాయి. 
 
ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్స్ ఎప్పుడు వస్తాయా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. బన్నీకి గ్యాప్ కలిసొచ్చింది. అలాగే.. పవన్ కళ్యాణ్‌కి కూడా ఈ గ్యాప్ అనేది కలిసొస్తుంది. వకీల్ సాబ్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తారని టీమ్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. మరి.. వకీల్ సాబ్ ఏస్ధాయి విజయాన్ని సాధిస్తారో.. ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు