`వకీల్ సాబ్` డబ్బింగ్ పూర్తి

శనివారం, 27 మార్చి 2021 (16:05 IST)
Pavan, Sriram
దాదాపు మూడేళ్ల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మూవీ ‘‘వకీల్ సాబ్’’. ప్రెస్టెజీయస్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ మూవీని దిల్ రాజు-శిరీష్ నిర్మించగా శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేశారు. ఏప్రిల్  9న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నాయి. ఇటీవ‌లే ఈ సినిమా డబ్బింగ్ మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్ ఈ రోజు పూర్తి చేశారు. దీంతో ఈ సినిమా డబ్బింగ్ మొత్తం పూర్తయింది. ఫైనల్ మిక్సింగ్ తదితర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న థియేట్రికల్ ట్రైలర్ ఈనెల 29న రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్‌, నివేదా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య నాగ‌ళ్ల ఇత‌ర తారాగ‌ణంగా న‌టిస్తున్నారు. 
ఈ చిత్రానికి 
సంగీతం:  ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌, 
సినిమాటోగ్ర‌ఫీ:  పి.ఎస్‌.వినోద్‌, 
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌:  రాజీవ‌న్‌, 
ఎడిటింగ్‌:  ప్ర‌వీణ్ పూడి,
డైలాగ్స్‌:  తిరు, 
యాక్ష‌న్ ర‌వివ‌ర్మ‌, 
వి.ఎఫ్‌.ఎక్స్‌:  యుగంధ‌ర్‌, 
కో ప్రొడ్యూస‌ర్‌:  హ‌ర్షిత్ రెడ్డి, 
స‌మ‌ర్ప‌ణ‌:  బోనీ క‌పూర్‌, 
నిర్మాత‌లు:  దిల్‌రాజు, శిరీష్ , 
మాటలు-మార్పులు-ద‌ర్శ‌క‌త్వం:  శ్రీరామ్ వేణు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు