వకీల్‌సాబ్ పరంగా చెప్పాలంటే, ముగ్గురు అమ్మాయిలకు జరిగిన సంఘటనలు, వారి మొండి పట్టుదల, ఆ తర్వాత దానికి కారణమైన అహంకార యువకుడి వల్ల వారి జీవితంలో ఏం జరిగిందనేది వేణు శ్రీరామ్ దర్శకుడు చక్కగా మలిచారు. పింక్ రీమేక్ అయినా దాన్ని కొద్ది మార్పులతో దిల్‌రాజు, శిరీష్ నిర్మించారు.
దిల్ రాజు మాట్లాడుతూ,, అమెజాన్‌లో విడుదల కావడం ఆనందంగా వుంది. సినిమా హాల్లలో చూసిన వారంతా మెచ్చుకున్నారు. ఇక కరోనా సెకండ్ వేవ్‌లో చాలా మంది చూడలేకపోయారు. కనుక డిజిటల్ మీడియా ద్వారా మరింత మంది ప్రేక్షకులకు దగ్గరవుతుందని తెలిపారు.