పవన్‌కళ్యాణ్ `వకీల్‌సాబ్` సినిమా ప్రీరిలీజ్ హైదరాబాద్‌లో చేయాలని నిర్ణయించుకున్నారు. ఇంతకుముందే జరగాలి. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూవచ్చింది. పవన్ షూటింగ్ బిజీవల్లకానీ, తిరుపతి ఎన్నికల వల్లకానీ సమయం సరిపోలేదని పవన్ వర్గాలు తెలియజేశాయి. అలాగే పవన్ ప్రీరిలీజ్‌కు మెగాస్టార్ చిరంజీవికూడా హాజరు కానున్నారని వార్తలు హల్‌చల్ చేశాయి. కానీ తాజా సమాచారం ప్రకారం సింహం సింగిల్‌గానే వస్తుంది. ఎవరు వచ్చినా పవన్ మాటకోసమే అందరూ ఎదురు చూస్తుంటారు.