వివాదాస్పద నటి వనితా విజయకుమార్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షాకింగ్ పోస్ట్ చేశారు. ఇందులో తనను ఓ వ్యక్తి కొట్టాడని, ముఖం నుంచి రక్తం కారుతుందని పేర్కొంది. డిన్నర్ ముగించి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపింది.
"ఉన్నట్టుండి అతను నన్ను గట్టిగా కొట్టడం ప్రారంభించాడు. రెడ్ కార్డ్ ఇస్తున్నావా, సపోర్ట్ చేస్తున్నావా? అంటూ నా ముఖం మీద కొట్టాడు. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయమని ఆమె నన్ను బలవంతం చేశారు. కానీ నేను ఈ చట్టంపై నమ్మకం కోల్పోయాను. ఆ తర్వాత ప్రథమ చికిత్స చేశాను. నాపై దాడి చేసిన ఆ రహస్య వ్యక్తి ఎవరో నాకు తెలియదు." వనితా విజయ్ కుమార్ వెల్లడించింది.