రీల్స్, సెలూన్ వద్దన్నారు.. నిక్కీపై వరకట్నం వేధింపులు.. సజీవదహనం.. భర్తను అలా పట్టుకున్నారు? (video)

సెల్వి

సోమవారం, 25 ఆగస్టు 2025 (11:44 IST)
Nikki
గ్రేటర్ నోయిడాలో ఓ వివాహ వరకట్నం కోసం బలైపోయింది. గ్రేటర్ నోయిడాలోని సిర్సా గ్రామంలో నిఖీ అనే వివాహితను ఆమె భర్త, అత్తమామలు కలిసి కట్నం కోసం దారుణంగా హత్య చేసిన సంఘటన సంచలనానికి దారితీసింది. వరకట్నం కోసం ఆమెకు నిప్పుపెట్టి హతమార్చారు. ఈ హత్యకు నిఖీ ఐదేళ్ల కుమారుడు ప్రత్యక్ష సాక్షిగా నిలిచాడు. 
 
అమ్మను నాన్నే కాల్చి చంపేశారని ఆ చిన్నారి చెప్పిన మాటలు అందరినీ కలచివేస్తున్నాయి. ఆ కేసులో నిఖీ భర్త విపిన్‌ను పోలీసులు ప్రధాన నిందితుడిగా అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన లిక్విడ్‌ను స్వాధీనం చేసుకోవడానికి అతడిని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. 
 
కాగా నిఖిని హింసిస్తున్న సమయంలో మృతురాలి అక్క తీసిన వీడియో కూడా సంచలనంగా మారింది. ఆమెతో పాటు  తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.  ఈ ఘటనలో విపిన్ అరెస్టు కాగా, అతని తల్లి దయా, తండ్రి సత్యవీర్, సోదరుడు రోహిత్ పరారీలో ఉన్నారు.
 
కాగా, విపిన్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు నిందితుడిని సంఘటన స్థలానికి తీసుకెళ్లిన సమయంలో  నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పోలీసులు తుపాకీ లాక్కొని కాల్పులు జరిపేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. 
 
ఆ సమయంలో పోలీసులు తమను తాము రక్షించుకోవడానికి నిందితుడిపై కాల్పులు జరిపినట్లు ఉత్తరప్రదేశ్ పోలీసులు వెల్లడించారు. అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరిపినట్లు తెలిపారు. ఈ కాల్పుల్లో నిందితుడి కాలికి గాయం అయింది. దీంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు.
 
కేసు వివరాలు 
ఆరు నెలల ముందు, 28 ఏళ్ల నిక్కీ భాటి తన భర్త విపిన్ దాడి చేసిన తరువాత గ్రేటర్ నోయిడాలోని తన అత్తమామల ఇంటిని విడిచిపెట్టి దాద్రిలో తన తల్లిదండ్రులతో నివసించడానికి వెళ్ళింది. అక్కడ పంచాయితీ పెట్టారు. అక్కడ విపిన్ క్షమాపణలు చెప్పాడు. తన భార్యను మళ్ళీ ఎప్పుడూ కొట్టనని వాగ్దానం చేశాడు. ఇదంతా నమ్మి నిక్కీ అతనితో ఉండటానికి తిరిగి వెళ్లింది. కానీ అది జరగలేదు. 
 
 
 
నిక్కీ, అతని సోదరి, విపిన్ కుటుంబీకులు ఆమెను వేధించారు. నిక్కీ సెలూన్ నడిపింది. కానీ విపిన్, అతని కుటుంబం దీన్ని ఇష్టపడలేదని తెలిసింది. అంతేగాకుండా నిక్కీ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ పోస్ట్ చేయడాన్ని విపిన్ వ్యతిరేకించాడు. ఇది ఇంట్లో క్రమం తప్పకుండా గొడవలకు దారితీసింది. 
 
నిక్కీ తండ్రి అతనికి స్కార్పియో SUV, రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్, బంగారం, నగదు బహుమతిగా ఇచ్చినప్పటికీ విపిన్, అతని కుటుంబం మరింత కట్నం డిమాండ్ చేస్తూనే ఉన్నారు. గురువారం, ఈ వాగ్వాదం దాడిగా మారింది. విపిన్, అతని తల్లి దయా నిక్కీకి నిప్పంటించారు. ఆమె తన ఏడేళ్ల కుమారుడు, సోదరి ముందు సజీవ దహనం చేశారు.

टॉप मॉडल स्कॉर्पियो दिया, फिर भी 35 लाख की डिमांड, दहेज लोभी ससुराल वालों ने Noida की निक्की को पेट्रोल छिड़ककर जिंदा जला डाला ????????#ViralVideo #breakingnews #JusticeForNikki pic.twitter.com/1uh4LWwscS

— Aadhya Kaur (@AadhyaKaur) August 24, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు