"మీకు (ప్రేక్షకులు) ఓ మంచి సినిమా ఇద్దామనే ఉద్దేశంతో చాలా ప్యాషన్ తో కష్టపడి పనిచేశాం. అయితే మేం అనుకున్న ఐడియా, అనుకున్నట్టుగా తెరపైకి రాలేదు. ప్రతిసారి మీకు వినోదం పంచాలనే ఉద్దేశంతోనే సినిమా చేస్తాను. కొన్ని సార్లు నేను సక్సెస్ అవుతాను, మరికొన్ని సార్లు నేను పాఠాలు నేర్చుకుంటాను. కానీ హార్డ్ వర్క్ మాత్రం ఆపను. అంటూ పేర్కొన్నాడు. గతంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ వినయ విధేయ రామ చేశాడు. అది డిజాస్టర్ అయింది. చరణ్ అప్పుడు అభిమానులకు, ప్రేక్షకులకు క్షమాపణలు కోరాడు. ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా అదే రూటులో స్పందించాడు.