అమలాపాల్‌పై కేసు..చెల్లదన్న కేరళ పోలీసులు.. ఏమైంది..?

బుధవారం, 28 ఆగస్టు 2019 (18:24 IST)
నాయక్ చిత్రంలో చెర్రీ సరసన నటించిన అందాల భామ అమలాపాల్ కొన్ని నెలల క్రితం ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి విదితమే. అమలాపాల్ కేర‌ళ‌లో నివ‌సిస్తూ పుదుచ్చేరిలో నివాసం ఉంటున్నట్లుగా త‌ప్పుడు చిరునామా డాక్యుమెంట్ చూపి ల‌గ్జ‌రీ కారు కొన్న‌దంటూ ఆమెపై పలు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో ఆమె అరెస్ట్ అవుతుందనే వార్తలు కూడా వినిపించాయి. 
 
అంతేకాకుండా రూ.20 ల‌క్ష‌లు ఎగ్గొట్టి చ‌ట్ట వ్య‌తిరేక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డిన అమ‌లాపాల్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ కిర‌ణ్ బేడి అప్ప‌ట్లో ఆదేశించారు. ఇదే అంశంపై సెక్షన్ 430 - 468 - 471 సెక్షన్ల కింద క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు న‌మోదు చేసారు. విచారణను పూర్తి చేసిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వివరాలను వెల్లడించారు. 
 
అయితే ఈ సంఘటన జరిగింది పుదుచ్చేరిలో అయితే కేసు ఫైల్ అయింది కేరళలో కాబట్టి ఇది మా ప‌రిధిలోకి రాదంటూ కేర‌ళ పోలీసులు కేసు కొట్టేసిన‌ట్టు తెలుస్తుంది. మొత్తానికి కేరళ పోలీసుల నైజం కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుందని నెటిజన్లు కామెంట్‌లు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు