మేయాద మాన్ దర్శకుడు రత్నకుమార్ దర్శకత్వంలో, అమలాపాల్ నటించిన ఆడై సినిమా నుంచి తాజాగా విడుదలైన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పుట్టినరోజు జరుపుకునేందుకు స్నేహితులతో కలిసి వెళ్లిన అమలాపాల్.. దుస్తులు లేకుండా ఓ ప్రాంతంలో చిక్కుకుపోతుంది.
ఆ ప్రాంతం నుంచి ఆమె ఎలా బయటపడుతుందని అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో విజే రమ్య, వివేక్ ప్రసన్న కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ చిత్రం నుంచి విడుదలైన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.