దర్శకుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ వి అంటేనే విక్టరీ అనే డైలాగ్‌తోనే వెంకటేశ్ ప్రయాణం మొదలైంది. అందుకు తగ్గట్టే తన ప్రయాణం విజయవంతంగా కొనసాగుతోంది. రామానాయుడు నాపై పెట్టిన బాధ్యత మేరకే వెంకటేశ్‌ని తెరకు పరిచయం చేశా. తన ఎదుగుదలకు మాత్రం తను ఎంచుకున్న కథలు, పాత్రలు, తన అన్నయ్యే కారణం. ఇన్ని రకాల సినిమాలు మరే హీరో చేయలేడేమో అనేలా ఆయన కెరీర్ కనిపిస్తుంది అన్నారు.
ఈ కార్యక్రమంలో అనిల్ రావిపూడి, బాబీ, శైలేశ్ కొలను, శ్రీవిష్ణు, బ్రహ్మానందం, అలీ, నిఖిల్, విశ్వక్సేన్, అడివిశేష్, దామోదర్ ప్రసాద్, విజయ్‌భాస్కర్.కె, ముప్పలనేని శివ, భీమనేని శ్రీనివాసరావు, బెల్లంకొండ సురేశ్, రామ్ ఆచంట, గోపి ఆచంట, టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, వివేక్ కూచిభొట్ల, వెంకట్ బోయనపల్లి, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా, సైంధవ్ టీమ్ పాల్గొన్నారు.