నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ సైంధవ్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో వికాస్ మాలిక్ అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. విశేషం ఏమిటంటే ఈ చిత్రంలో తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెబుతున్నారు నవాజుద్దీన్ సిద్ధిఖీ. తాజాగా తన పాత్రకు సంబధించిన డబ్బింగ్ ని ప్రారభించారు. ఈ మేరకు డబ్బింగ్ స్టూడియో నుంచి స్పెషల్ వీడియోని విడుదల చేశారు. నవాజుద్దీన్ స్వయంగా తెలుగులో డబ్బింగ్ చెబుతున్న ఈ వీడియో ఎంతగానో అలరించింది.
నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సెన్సేషనల్ కంపోజర్ సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఎస్.మణికందన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్, గ్యారీ బిహెచ్ ఎడిటర్.
ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా, బేబీ సారా, జయప్రకాష్లు ఈ సినిమాలో ఇతర ముఖ్య తారాగణం. కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత.
తారాగణం: వెంకటేష్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా, సారా, జయప్రకాష్