బాబాయ్ వెంకీ - అబ్బాయ్ రానా మధ్య పోటీ, ఎవరు గెలుస్తారు?

గురువారం, 27 ఫిబ్రవరి 2020 (19:27 IST)
వెంకీ-రానా
విక్టరీ వెంకటేష్‌ నటిస్తున్న తాజా చిత్రం నారప్ప. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమా సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక దగ్గుబాటి రానా నటిస్తున్న తాజా చిత్రం విరాటపర్వం. ఈ చిత్రానికి వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని సురేష్ బాబు మరో నిర్మాత సుధాకర్ చెరుకూరితో కలిసి నిర్మిస్తున్నారు. ఈ బాబాబయ్ - అబ్బాయ్‌లు పోటీపడుతున్నారని వార్తలు వస్తున్నాయి.
 
ఇంతకీ.. మేటర్ ఏంటంటే... వైవిధ్యమైన కథలు కోసం తపించే వెంకీ... ఈసారి విభిన్న కథాంశంతో నారప్పగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అనంతపురంలో షూటింగ్ ప్రారంభించారు. ఆ తర్వాత తమిళనాడులో కొన్ని యాక్షన్ సీన్స్‌ను షూట్ చేసారు. ఈ సినిమాలోని వెంకీ లుక్ రిలీజ్ చేయగానే... అసురన్ సినిమా చూసిన వాళ్లు గెటప్ కరెక్ట్‌గా సెట్ అయిందని ఫీలయితే.. అసురన్ సినిమా చూడని వాళ్లు వెంకీ గెటప్ కొత్తగా ఉందనుకున్నారు. 
 
మొత్తానికి నారప్ప లుక్ సినిమాపై అంచనాలను పెంచింది. ఈ సినిమాలో వెంకీ సరసన ప్రియమణి నటిస్తుంది. మరో హీరోయిన్‌గా అమలాపాల్ నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. శ్రీకాంత్ అడ్డాల ఈ యాక్షన్ మూవీని ఎలా తెరకెక్కిస్తాడో అనుకున్నారట కానీ... యాక్షన్ ఎపిసోడ్స్‌ని బాగా డీల్ చేస్తున్నాడని.. ఇప్పటివరకు షూట్ చేసిన యాక్షన్ సీన్స్ చాలా బాగా వచ్చాయని టీమ్ మెంబర్స్ చెబుతున్నారు. ఈ సినిమాని సురేష్ బాబు సమ్మర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. రానా నటిస్తున్న తాజా చిత్రం విరాటపర్వం. నీది నాది ఒకే కథ అనే చిన్న సినిమాతో విజయం సాధించిన యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ వేణు ఉడుగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రానా సరసన సాయి పల్లవి నటిస్తుంది. పొలిటికల్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. రానా పాత్ర పాజిటివ్‌గా ఉంటూనే నెగిటివ్ యాంగిల్ కూడా ఉంటుందట. 1990 నాటి సామాజిక పరిస్థితుల ఆధారం చేసుకుని ఈ పీరియాడిక్ సోషల్ డ్రామాను దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. నక్సలైట్ ఉద్యమం నేపథ్యంలో సాగే ఈ కథలో రానా నక్సలైట్‌గా నటిస్తుండగా, సాయి పల్లవి జానపద గాయనిగా నటిస్తోందని సమాచారం. 
 
ప్రియమణి నక్సలైట్ పాత్ర పోషిస్తుందట. ఈ సినిమాని కూడా సమ్మర్లోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.నారప్ప 1980 కాలం నాటి బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతుంటే... విరాటపర్వం 1990 బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతోంది. ఈ రెండు చిత్రాలను సురేష్‌ ప్రొడక్షన్స్ సంస్థ వేరే నిర్మాణ సంస్థలతో కలిసి నిర్మిస్తుంది.

మరో విశేషం ఏంటంటే... ఈ రెండు సినిమాల్లోను ప్రియమణి నటిస్తుంది. అయితే.. బాబాబయ్ వెంకీ నారప్ప - అబ్బాయ్ రానా విరాటపర్వం సినిమాలు సమ్మర్లో వస్తుండటం విశేషం. మరి... బాక్సాఫీస్ వద్ద బాబాయ్ వెంకీ, అబ్బాయ్ రానా ఎంతవరకు ఆకట్టుకుంటారో చూడాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు