డీఎండీకే చీఫ్ విజయ్‌కాంత్ సతీమణి ప్రేమలతకు కరోనా..

మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (12:34 IST)
నటుడు, డీఎండీకే నాయకుడు విజయ్‌కాంత్ సెప్టెంబర్ 22న కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. సాధారణ పరీక్షల కోసం మియోట్‌ ఇంటర్నేషనల్‌ దవాఖానకు విజయ్ కాంత్ వెళ్ళగా, అక్కడ జరిపిన పరీక్షలలో పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. విజయ్‌కాంత్‌కు తేలిక పాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని, త్వరలోనే ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవుతారని వైద్యులు చెబుతున్నారు.
 
తాజాగా విజయ్ కాంత్ భార్య ప్రేమలత విజయ్ కాంత్ కూడా కరోనా బారిన పడ్డారు. సెప్టెంబర్ 28న ఆమెకు కరోనా సోకినట్టు నిర్ధారణ కాగా, ఈ రోజు ఆసుపత్రిలో చేరారు. విజయ్ కాంత్ చేరిన ఆసుపత్రిలోనే ప్రేమలత కూడా చేరింది. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని, ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి బృందం హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు