బాలీవుడ్ సంగీత దర్శకుడు లక్ష్మణ్‌ మృతి

శనివారం, 22 మే 2021 (15:01 IST)
Lakshmanan
సిని పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. 'హమ్ ఆప్కే హై కౌన్' వంటి బాలీవుడ్ చిత్రాల సంగీత దర్శకుడు లక్ష్మణ్‌ (78) నాగ్‌పూర్‌లో శనివారం తెల్లవారుజామున 2 గంటలకు తుదిశ్వాస విడిచారు. గుండె పోటు కారణంగా చనిపోయినట్లు ఆయన కుమారుడు అమర్ తెలిపారు. 
 
ఇటీవలనే ఆయన రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్నారని, అప్పటి నుంచి చాలా నీరసంగా, బలహీనంగా కనిపించారని ఆయన కుమారుడు చెప్పారు. 1942 సెప్టెంబర్ 16 న మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన అసలు పేరు విజయ్ పాటిల్‌. 
 
సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటున్న సమయంలో సోదరుడు సురేంద్ర పాటిల్‌తో కలిసి రామ్‌లక్ష్మణ్‌గా తమ పేర్లు మార్చుకున్నారు. 'మైనే ప్యార్ కియా', 'హమ్ ఆప్కే హై కౌన్', 'హమ్ సాథ్ సాథ్ హై' చిత్రాలకు సంగీతం అందించిన రామ్ లక్ష్మణ్.. నాగ్‌పూర్‌లో తన కుమారుడు అమర్‌తో కలిసి నివసిస్తున్నాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు