"ల‌య‌న్ - టైగ‌ర్‌"ల క్రాస్ బ్రీడ్ 'లైగ‌ర్'

సోమవారం, 18 జనవరి 2021 (11:03 IST)
టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ తాజా చిత్రం పేరును 'లైగర్‌'గా ఖరారు చేశారు. ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రం త‌ర్వాత పూరీ జ‌గ‌న్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. పూరీ క‌నెక్ట్స్, ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది.
 
రియాలిటీకి దగ్గరగా ఉండేలా విజయ్ దేవరకొండ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా థాయ్‌లాండ్‌లో శిక్షణ కూడా తీసుకున్నారు. పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ఈ చిత్రాన్ని అతిత్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా, పూరి, విజయ్ కాంబో కావడంతో ఈ మూవీపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. 
 
తాజాగా చిత్ర టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. "ల‌య‌న్, టైగ‌ర్‌ల క్రాస్ బ్రీడ్ లైగ‌ర్" అంటూ చిత్ర టైటిల్ అనౌన్స్ చేసిన మేక‌ర్స్ ఫ‌స్ట్ లుక్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని స‌రికొత్త‌గా చూపించారు. ఈ పోస్ట‌ర్ సినిమాపై భారీ ఆస‌క్తిని క‌లిగిస్తుంది. క‌రోనా వ‌ల‌న ఆగిన చిత్ర షూటింగ్ మ‌ళ్ళీ మొద‌లైంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు