Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

దేవీ

మంగళవారం, 15 ఏప్రియల్ 2025 (17:37 IST)
Vijay-gowtam
విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్‌డమ్ గురించి చిత్ర యూనిట్ తాజా అప్ డేట్ ఇచ్చింది. ప్రస్తుతం ‘కింగ్‌డమ్’ చిత్ర డబ్బింగ్ పనులు జరుగుతున్నాయనీ, ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ పూర్తయిందంటూ విజయ్ తన ఇన్‌స్టా స్టోరీలో తెలిపాడు. డబ్బింగ్ అనంతరం బయటకు వెళుతున్న విజయ్ తో  దర్శకుడు గౌతమ్‌తో చర్చిస్తున్న ఫోటోను కూడా ఆయన షేర్ చేశాడు.
 
తెలుగులో సరైన విజయం లేకపోయినా విజయ్ దేవరకొండ కు మంచి ఫాలోయింగ్ వుంది. ఇటీవలే ప్రధాని అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మైహోమ్ రామేశ్వరావుతో కలిసి  గడిపిన అంశాలు కూడా అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మా బేనర్ లో మరో హిట్ చిత్రం అవుతుందని నాగవంశీ ఇటీవలే సూచాయిక తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు