Vijayendra Prasad - Guduru Narayana Reddy
బాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్ దేశ్ పాండే నటీనటులుగా సమర్ వీర్ క్రియేషన్స్ బ్యానర్‌పై యాటా సత్యనారాయణ దర్శకత్వంలో గూడూరు నారాయణ రెడ్డి నిర్మించిన చిత్రం ‘రజాకార్’. మార్చి 15న ఈ చిత్రాన్ని దక్షిణాది భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు మరాఠీ, హిందీ భాషల్లోనూ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శనివారం చిత్ర యూనిట్ హిస్టారికల్ హిట్ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. హిస్టారికల్ హిట్ విజయోత్సవాల్లో భాగంగా చిత్ర యూనిట్ అంతా కేక్ కట్ చేశారు.