మరాఠీ, హిందీ, రంగస్థల నటుడు విక్రమ్ గోఖలే తుదిశ్వాస విడిచారు. ఈయన వయసు 77 యేళ్లు. గత కొద్ది రోజులుగా పూణేలో దీనానాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో వైద్యులు ఈయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. ఆయన శరీర అవయవాలు పనిచేయలేకపోవడంతో ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.