కన్నప్ప న్యూ పోస్టర్ తో టీజర్ ప్రకటించిన విష్ణు మంచు

డీవీ

శుక్రవారం, 7 జూన్ 2024 (16:48 IST)
Kannappa teaser poster
డైనమిక్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ నుంచి మోస్ట్ అవెయిటెడ్ అప్డేట్ రాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి మహామహులు నటిస్తున్న సంగతి తెలిసిందే.
 
కన్నప్ప టీజర్‌ను కేన్స్ ఫెస్టివల్‌లో ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ది వరల్డ్ ఆఫ్ కన్నప్పను చూసి కేన్స్‌కు వచ్చిన అతిరథమహారథులు ప్రశంసించిన సంగతి తెలిసిందే. ఇక ఇండియన్ ఆడియెన్స్ ఈ టీజర్‌ను చూసే టైం వచ్చింది. జూన్ 14న కన్నప్ప టీజర్ రాబోతోందని మేకర్లు ప్రకటించారు. ఈ మేరకు వదిలిన పోస్టర్‌ అందరిలోనూ మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. గుర్రం మీద విష్ణు కూర్చున్న తీరు, చుట్టూ కనిపిస్తున్న అటవీ ప్రాంతాన్ని చూస్తుంటే సిల్వర్ స్క్రీన్‌పై అద్భుతాన్ని చూడబోతున్నామనే ఫీలింగ్ కలిగేలా ఉంది.
 
అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద మోహన్ బాబు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన కన్నప్ప ఫస్ట్ లుక్ పోస్టర్, ఇచ్చిన అప్డేట్లతో ఆడియెన్స్‌లో మంచి హైప్ క్రియేట్ అయింది. ఈ విజువల్ వండర్ కోసం దేశవిదేశాల నుంచి ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు