'మాస్ మహారాజ్'ని సెట్ చేసుకున్న వి.వి.వినాయక్

సోమవారం, 18 మార్చి 2019 (12:57 IST)
రవితేజ... పేరు చెప్తేనే మాస్‌కి కావలసినంత కిక్... ఇక వి.వి.వినాయక్ గురించి అయితే అసలు చెప్పనవసరమే లేదు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఒక సినిమా రానుందనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది.
 
మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం.. వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో 'డిస్కో రాజా' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడట. ఈ ప్రాజెక్టు తర్వాత ఆయన వి.వి.వినాయక్‌తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 
 
'ఇంటిలిజెంట్' తర్వాత వినాయక్ వేరే ప్రాజెక్టులు అనుకున్నప్పటికీ అవి ఏవీ కార్యరూపం దాల్చకపోవడం. బాలయ్య బాబుతో అనుకున్న సినిమా కూడా వెనక్కిపోయిన నేపథ్యంలో ఆయన రవితేజకి ఒక కథను వినిపించడం.. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయనే టాక్ టాలీవుడ్‌లో చక్కర్లు కొట్టేస్తున్నాయి. 
 
గతంలో తనకి 'కృష్ణ' సినిమాతో మంచి హిట్ ఇచ్చిన కారణంగా రవితేజ మరో ఆలోచన చేయలేదని అంటున్నారు. ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఈ కాంబినేషన్ కృష్ణ లాంటి మరో సినిమాని అందజేయనుందా. వేచి చూద్దాం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు