ఉదయ భాను ట్విన్ డాటర్స్ వీరే.. పేర్లు ఏంటో తెలుసా? యువీ నక్షత్ర, భూమి ఆరాధ్య

మంగళవారం, 24 జనవరి 2017 (15:36 IST)
బుల్లితెరపై అందాలను ఆరబోస్తూ.. సినీ అవకాశాలు కొట్టేసిన ఉదయ భాను.. ఆపై ఆడియో ఫంక్షన్లు, లైవ్ షోలను కండెక్ట్ చేయడంలో టాప్‌లో ఉంటుంది. తనదైన స్టైల్‌లో ఐటమ్ గర్ల్‌గానూ ఉదయభాను మెరిసింది. తాజాగా ఆమె తల్లి అయ్యింది. పదేళ్ల క్రితం వ్యాపారవేత్త విజయ్ కుమార్‌ను పెళ్లాడిన ఉదయ భాను.. పదేళ్ల తర్వాత ఆగస్టు 28వ తేదీన కవల పిల్లలు పుట్టారు. 
 
ఇద్దరూ ఆడపిల్లలు పుట్టడంతో తన ఇంటికి లక్ష్మీ దేవులు వచ్చారని ఉదయభాను సంబరపడింది..కాగా పుట్టిన వెంటనే ఫోటోలను బయటపెట్టని ఉదయభాను ప్రస్తుతం కవలపిల్లలతో ఉన్న ఫోటో కూడా పెట్టింది. ఇటీవల ప్రముఖ జర్నలిస్ట్ ప్రేమ... ఉదయభానును కలిసారు. ఈ సందర్భంగా ఆమె ఉదయభాను ఇద్దరు కూతుళ్లతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసారు. ఈ పిల్లల పేర్లు కూడా యువీ నక్షత్ర, భూమి ఆరాధ్య అని ప్రముఖ జర్నలిస్ట్ తన ఫేస్ బుక్ పేజీలో వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి