ఈ సందర్భంగా హైదరాబాద్లో మీడియాతో రాజమౌళి మాట్లాడుతూ, ఎ.పి. ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు అన్నివిధాలా అనుకూలంగా వుంటుందని తెలిపారు. ఆయన దీనిపై వివరణ ఇస్తుండగానే, ఎ.పి. ప్రభుత్వం టికెట్ల ధరను 100 రూపాయలు పెంచినట్లు ప్రకటన వెలువడింది. అంతకుముందు పెద్దల రిక్వెస్ట్ మేరకు ఏపీలో కొత్త జీవో విడుదలైనప్పటికీ అక్కడ 20 శాతం షూటింగ్ జరుపుకున్న చిత్రాలకు మాత్రమే టికెట్ రేట్లను పెంచుకునే అవకాశాన్ని కన్పించింది ప్రభుత్వం. దీంతో కొత్త జీవోపై “రాధేశ్యామ్” పెట్టుకున్న ఆశలు అడియాశలే అయ్యాయి.
నేడు వెలువడిన ప్రకటన వల్ల “ఆర్ఆర్ఆర్” టిక్కెట్ ధరలను 100 రూపాయల పెంపునకు అనుమంతించింది. ఎ.పి.లో టికెట్ రేట్ల విషయంలో ఈ బెనిఫిట్ అందుకుంటున్న మొదటి తెలుగు సినిమా రాజమౌళిదేకావడం విశేసం. ఇక బెనిఫిట్ షోలకు కూడా ఏపీలో సపోర్ట్ లభించింది. ఎగ్జిబిటర్లు పెద్ద సినిమాలను రోజుకు ఐదు షోలు ప్రదర్శించవచ్చని ఏపీ మంత్రి పేర్ని నాని తెలిపారు. పెద్ద సినిమా, చిన్న సినిమా ఒకేరోజు విడుదలైతే ఎగ్జిబిటర్లు కనీసం రోజుకు ఒక్కసారైనా చిన్న సినిమాలను ప్రదర్శించాలని అన్నారు.