Apsara Rani, Naina Ganguly
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో అప్సర రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం మా ఇష్టం. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 8 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలుగు చలన చిత్ర రంగంలో మొట్టమొదటిసారిగా ఇద్దరమ్మాయిల ప్రేమకథతో వస్తున్న ఈ సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దేశవ్యాప్తంగా పలు నగరాలలో ఈ సినిమా కి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించిన చిత్ర బృందం ఇప్పుడు హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో రామ్ గోపాల్ వర్మ తో పాటు అప్సర రాణి, నైనా గంగూలీ, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ లు పాల్గొన్నారు.