ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 'నేను ఇండస్ట్రీలో అడుపెట్టాక పర్సనల్ అసిస్టెంట్ ఒకరు ఫలానా నటుడికి టెక్ట్స్ మెసేజ్ పంపించాలని చెప్పాడు. అతడితో డేటింగ్ చేయమని కోరాడు. అతడికి పెళ్లయింది కదా? అని ప్రశ్నిస్తే అప్పుడతడు ఓ క్రికెటర్ పేరు చెప్పి అతడికి మెసేజ్ ఎందుకు పంపించకూడదు? అని ఎదురు ప్రశ్నించాడు. మీ పబ్లిక్ ఇమేజ్‌కు, పబ్లిక్ రిలేషన్స్‌కు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది' అని అతడు తనకు సలహా ఇచ్చాడని వివరించింది.
ఇప్పటివరకు తాను డేటింగ్ జోలికి వెళ్లలేదన్నారు. బయట నుంచి సినీ పరిశ్రమలోకి వచ్చిన వారికి ఇటువంటి అనుభవాలే ఎదురవుతాయని చెప్పింది. తనకు ఇటువంటివి ఇష్టం లేకపోవడం వల్లే ఇండస్ట్రీలో చాలా తక్కువమంది స్నేహితులు ఉన్నారని వివరించింది. ఇండస్ట్రీలో అందరితో సంబంధాలు ఉండాలని, కానీ అవి ఈ తరహా మాత్రం కాకూడదని పేర్కొంది.