దీనికి నందమూరి కుటుంబ సభ్యులతోపాటు చిరంజీవి, వెంకటేష్, టి. సుబ్బరామిరెడ్డి, రఘు రామ కృష్ణం రాజు, కె, రాఘవేంద్రరావు, మురళీమోహన్, విజయేంద్ర ప్రసాద్, అశ్వినీదత్, సుహాసిని, మంచు విష్ణు, మాలశ్రీ, మైత్రీ మూవీమేకర్స్ నిర్మాతలు, నవీన్, రవిశంకర్, గోపీచంద్, బోయపాటి శ్రీను, పి.వాసు, జయసుధ కుటుంబం, విశ్వక్ సేన్, తదితరులు పాల్గొన్నారు.
అనంతరం చిరంజీవి మాట్లాడుతూ, బాలయ్య బాబు 50 సంవత్సరాల ఈ కన్నుల వేడుకలో మేము పాలు పంచుకోవడం మాకు చాల ఆనందం. ఇది బాలయ్యకు మాత్రమే కాదు, తెలుగు చలన చిత్రానికి ఒక వేడుకలా చూస్తున్నాను. అరుదైన రికార్డు బాలయ్య సొంతం చేసుకున్నందుకు సంతోషం. ఎన్టీఆర్ గారికి ప్రజల మదిలో ప్రత్యేక స్థానం ఉంది. ఆయన కొడుకుగా బాల కృష్ణ తండ్రి చేసిన పాత్రలు వేస్తూ ప్రేక్షకులను మెప్పించడం మామూలు విషయం కాదు. తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన తన ప్రత్యేకత చాటుకున్నారు. నేను ఇంద్ర సినిమా చేయడానికి ఆదర్శం కూడా సమర సింహా రెడ్డి. నాకు బాలయ్యతో కలిసి ఒక ఫాక్షన్ సినిమా చేయాలని ఒక కోరిక. ఫ్యాన్స్ గొడవలు పడుతుంటారు. ఫ్యాన్స్ కోసం హీరోల మధ్య ఎటువంటి మంచి బంధం ఉంటుందో తెలియడం కోసం కొన్ని వేడుకలు చేసుకునేవాళ్లం. అందుకే మా అభిమానులు కూడా కలిసి కట్టుగా ఉంటారు. మా ఇంట్లో ఎటువంటి శుభకార్యం జరిగినా బాలయ్య రాకుండా అందరూ. కలిసి డ్యాన్స్ కూడా వేస్తారు. 50 సంవత్సరాల ఈ ప్రయాణం ఇంకా హీరోగా నటించే ఘనత బాలయ్యకే సొంతం. భగవంతుడు బాలయ్యకు ఇదే ఎనరీ ఇస్తూ 100 ఏళ్లు బావుండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. రాజకీయ వైద్య రంగాలలో ఇలా సేవ చేయడం న భూతో న భవిష్యత్. మేము అంత ఒక కుటుంబం లాంటి వాళ్ళం, ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలో అని కోరుకుంటూ లాంగ్ లివ్ బాలయ్య.
నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ.. ఈ రోజు ఇంతమంది అభిమానులు, నా తోటి నటీనటులు, నాతో పని చేసిన ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు జన్మను ఇచ్చిన తల్లి తండ్రులకు, నాకు ఇంతటి అభిమానాన్ని ఇచ్చిన మీ అందరినీ నా గుండెల్లో పెట్టుకుంటాను. అలాగే నా కుటుంబం అయిన నిర్మాతలు, దర్శకులు, నటులు, కళాకారులు, సాంకేతిక బృందం, నా హాస్పిటల్ బృందం, హిందూపూర్ ప్రజలు, నా అభిమానులు అంత కలిసి ఈ వేడుకను ఇంత గొప్ప విజయం పొందేలా చేసినందుకు పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దీనికి వెనుక ఉంది నడిపించిన మా అసోసియేషన్, నిర్మాతల మండలి, ఛాంబర్, శ్రేయాస్ మీడియా, సాయి ప్రియ కన్స్ట్రక్షన్ తదితరులకు ప్రత్యేక ధన్యవాదాలు. నేను నా తండ్రి నుండి నేర్చుకున్నది నటన మాత్రమే కాదు. క్రమశిక్షణ, సమయానుకూలంగా, సంస్కారం. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు దగ్గర నుండి అంతగానే నేర్చుకున్నాను. మేము అందరం చలన చిత్ర పరిశ్రమలో పోటీగా నటిస్తూ ఉన్నప్పటికీ ఒక ఆరోగ్య పరమైన పోటీ మాత్రమే ఉంటుంది. అలాగే మిగతా వారు అంత చెప్పినట్లు నేను సినీ, రాజకీయ, వైద్య సేవ రంగాలలో ఉంటూ ఇలా ఉన్నాను అంటే దానికి కారణం అయిన ప్రతి ఒక్కరికీ రుణపడిఉంటాను. అలాగే నా భార్య వసుంధరకు ధన్యవాదాలు.