- ఢి జోడి షోలో స్రష్టి వర్మ పాల్గొంది. జోడి అంటే 18 ఏళ్ళు వున్నవారినే తీసుకుంటారు. మరి 16 సంవత్సరాలు అని ఎందుకు చెప్పింది. షో కోసం తప్పుడు సర్టిఫికెట్ తెచ్చింది. లేదా రెండేళ్ళ నాడే ఆమె బయట రేప్ కు గురయిందా?. ఆ రేప్ ఎవరు చేశారు? అప్పటికీ జానీ మాస్టర్ పరిచయమే లేదు. ఓరిస్సా అవతల నుంచి వచ్చిన ఆమె ఇక్కడ జానీమాస్టర్ తో సమానంగా షూటింగ్ లకు ట్రావెల్ అవుతూ, మాస్టర్ కు ఇచ్చే రాచమర్యాదలు, గౌరవం పట్ల ఆకర్షితురాలై ఇలాంటి పోకడలకు పోయిందని నాకు అర్థమైంది.
- నెల్లూరు నుంచి స్వశక్తితో ఎదిగిన జానీ మాస్టర్ శైలి సెపరేట్ గా వుంటుంది. ఎవరినీ లెక్కచేయని తనంలా కనిపిస్తాడు. కానీ చాలా మంచి వ్యక్తి. 14 ఏళ్ళపాటు నేను కాపురం చేసి చెబుతున్నా. చాలా సార్లు మా ఇంటికి స్రష్టివర్మ వచ్చింది. అన్నయ్య అనిపిలిచేది. గురువుగారు మరోసారి అనేది. కానీ మాకు అనుమానం రాకుండా ప్రవర్తించేది.