కాగా, తాజాగా లక్మీప్రసన్న ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టింది. ఆంగ్ల రచయిత మార్కస్ ఆరేలియస్ కోట్ చేసిన కొటేషన్... ప్రపంచంలో ఏదీ మీకు చెందనప్పుడు, మీరు ఏమి కోల్పోతారని భయపడుతున్నారు అని పోస్ట్ చేసింది. దీని అర్థం ఏమిటో డీప్ లో ఆలోచిస్తే అర్థమవుతుంది. అసలు మనోజ్ పెండ్లికి లక్మీప్రసన్న బాగా సపోర్ట్ చేసింది. కానీ మోహన్ బాబుకు ససేమిరా ఇష్టం లేదు. కానీ ఫైనల్ గా పెండ్లికి రావడం ఆశీర్వదించడం జరిగింది. మంచు కుటుంబంలో మనోజ్ తన సమస్యలన్నింటినీ లక్మీ ప్రసన్న ముందు పంచుకునేవారు. ఇప్పుడు ఆమె చేసిన కొటేషన్.. ఎవరికనేది మీరే తెలుసుకోండని వదిలేసింది.
ఇక దీనినిచూశాక కొందరయితే, తిరుపతిలో మోహన్ బాబు యూనివర్శిటీలోని హేమాద్రినాయుడు అతని అనుచరులు చుట్టుపక్కల హాస్ట్ విద్యార్థులను బెదిరించి లక్షలు వసూలు చేస్తున్నారని విమర్శలున్నాయి అంటూ ఓ పోస్ట్ కూడా పెట్టారు. మనోజ్ కూడా మీడియా ముందుకు వచ్చినప్పుడు యూనిర్శిటీలోని విషయాలను, అవకతవలను తనకు ఫోన్ లో చెప్పి బాధపడ్డారని అందుకే వారికోసమే నేను చేసే పోరాటమనీ, మా నాన్న దేవుడు అంటూ వివరించారు. మొత్తంగా చూస్తే, మోహన్ బాబు చుట్టూరా ఓ కోటరి వుందనీ వారే ఆయనకు తెలీయకుండా చేస్తున్నారా? తెలిసి చేస్తున్నారనేది? ప్రశ్నార్థకంగా మారింది.