Pawan Kalyan Warning: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. కలెక్టర్ల సదస్సులో మాట్లాడిన పవన్ కల్యాణ్... కాకినాడ ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడలో మంత్రి నాదెండ్ల మనోహర్ వెళ్లి మూడు చెక్ పోస్టులు పెట్టినా కూడా అక్రమ రవాణా జరుగుతుందంటే ఎవరిని నిందించాలో అర్థం కావట్లేదన్నారు.
గత ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేషన్ పాత్ర లేదని పవన్ కల్యాణ్ ఆరోపించారు. కేవలం వారు చెప్పింది వినడమే కానీ తప్పులు జరుగుతున్నాయి అని తెలిసినా వద్దు అని చెప్పలేని పరిస్థితి అన్నారు. తప్పులు జరుగుతున్నా వద్దని చెప్పకపోవడం వల్ల నేడు రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పులో కూరుకుపోయిందన్నారు. జనసేన పార్టీ ఆఫీసు దగ్గరకొచ్చి జనం సమస్యలు చెప్తుంటే డబ్బులు లేవు, జీతాలు ఇవ్వలేకపోయామని అధికారులు చెబుతున్నారు.