బాహుబలి సినిమాకు తర్వాత భల్లాలదేవ రానాకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. రామానాయుడు వారసుడిగా వచ్చిన దగ్గుబాటి రానా తొలుత బాలీవుడ్‌లో నటించాడు. ఆ తర్వాత తెలుగులోకి వచ్చాడు. బాహుబలి ఆయన కెరీర్‌ను మార్చేసింది. ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ, హాలీవుడ్‌లోనూ నటించేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే.. తాజాగా పంజాబీలో ఓ సినిమాను తన స్వంత బేనర్‌లో తీయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.
ఇటీవల పంజాబీలో 'సర్దార్ జీ' అనే చిత్రం ఘన విజయం సాధించింది. రూ. 20 కోట్లతో నిర్మించిన ఈ సినిమా రూ.50 కోట్లను రాబట్టింది. ఆ హక్కులు ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్స్ వారు తీసుకున్నారని తెలిసింది. సర్దార్ గెటప్‌లో రానా చాలా బాగుంటాడని.. ఆ చిత్ర నిర్మాత కూడా కాంప్లిమెంట్ ఇవ్వడం మరో విశేషం. బాహుబలి-2 తర్వాత ఈ సినిమాపై దృష్టి పెట్టేందుకు రానా నిర్ణయించుకున్నట్లు తెలిసింది.