ఆ హీరో వల్ల దివ్యభారతి ఎంతో ఏడ్చారట!

గురువారం, 14 మార్చి 2019 (17:09 IST)
చిన్నవయసులోనే చిత్ర పరిశ్రమలో కథానాయికగా ఒక వెలుగు వెలిగి ఎంత త్వరగా దూసుకొచ్చారో... అంత త్వరగా తిరిగి రాని లోకాలకు చేరుకున్న అందాల నటి దివ్య భారతి. ఎయిర్‌ హోస్టెస్‌ అవుదామనుకుని అనుకోకుండా సినిమాల్లోకి అడుగుపెట్టిన ఆమె 19 ఏళ్ల వయసులోనే చనిపోవడం చిత్ర పరిశ్రమను షాక్‌కు గురిచేసిన విషయం తెలిసిందే. 
 
అయితే.. బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమీర్‌ ఖాన్‌ కారణంగా ఒక సినిమా అవకాశం కోల్పోవడం వల్ల దివ్య భారతి ఎంతగానో ఏడ్చారట. ఈ విషయాన్ని ఒకానొక సందర్భంలో దివ్య భారతి తల్లి మీడియాతో వెల్లడించారు. ఓ షోలో పాల్గొనేందుకు అమీర్‌ ఖాన్‌, దివ్య భారతి, సల్మాన్ ఖాన్‌ లండన్‌ వెళ్లారు. అయితే దివ్య భారతి ప్రవర్తన అమీర్‌ ఖాన్‌కు నచ్చకపోవడంతో ఆమెతో కలిసి షోలో ప్రదర్శించనని చెప్పేసారట. 
 
ఈ విషయం తెలిసి దివ్య బాత్రూమ్‌లో గంటల తరబడి కన్నీరుమున్నీరయ్యారట. విషయం తెలుసుకున్న సల్మాన్‌ ఖాన్‌ ఆమెను ఓదార్చారని దివ్య తల్లి తెలిపారు. అంతేకాదు ‘డర్‌’ చిత్రంలో తొలుత దివ్యను కథానాయికగా ఎంచుకున్నప్పటికీ... అమీర్‌ ఖాన్‌కు ఆమెతో నటించడం ఇష్టంలేకపోవడంతో దివ్య స్థానంలో జూహీ చావ్లాను రికమెండ్‌ చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. 
 
అలా జూహీ చావ్లా, సన్నీ డియోల్‌, అమీర్‌ ఖాన్‌ ప్రధాన పాత్రల్లో ‘డర్‌’ చిత్రం తెరకెక్కాల్సి ఉంది. కానీ సినిమాలో పలు మార్పులు చేయడంతో అమీర్‌ ఖాన్ ఎందుకిలా చేశారని వైఆర్‌ఎఫ్‌ ఫిలింస్‌ అధినేత యశ్‌ చోప్రాను అడిగారట. అమీర్ ఖాన్ ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తుండడంతో ఆయన్ను సినిమా నుంచి తప్పించి ఆ తర్వాత అమీర్‌ ఖాన్ స్థానంలోకి షారుక్‌ వచ్చారట. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు