ప్రైజ్‌మనీలోంచి 31.2 శాతం ఆదాయపు పన్ను మినహాయిస్తే..34.40 లక్షలు మాత్రమే చేతికి అందాయి. 15 వారాలకు సంపాదించిన 30 లక్షలు, సువర్ణభూమి ప్లాట్ విలువ, అపాచీ స్పోర్ట్స్ బైక్ కలుపుకుని 1 కోటి 8 లక్షల వరకూ సంపాదించాడని తెలుస్తోంది.
సెప్టెంబర్ 5, 2021న ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 5, 106 రోజుల ప్రయాణాన్ని ఆదివారంతో ముగించుకుంది. ఈ సీజన్లో సరయు, ఉమదేవి, లహరి, నటరాజ్, హమీద, శ్వేతా వర్మ, ప్రియా, లోబో, విశ్వ, జస్వంత్, అనీ, రవి, ప్రియాంక సింగ్, కాజల్, సన్నీ, శ్రీరామ చంద్ర, సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్, మరియు మానస్ దాని 19 పోటీదారులుగా పాల్గొన్నారు. ఈ షోకు నటుడు నాగార్జున అక్కినేని వ్యాఖ్యాతగా ఉన్నారు. విన్నర్ సన్నీ 1989లో జన్మించాడు.
తెలంగాణలోని ఖమ్మంలో తన పాఠశాల విద్య పూర్తి చేశాడు. ఆ తరువాత హైదరాబాదులోని ఉస్మానియా కళాశాలలో బీకామ్ డిగ్రీని పూర్తి చేశాడు. జస్ట్ ఫర్ మెన్ అనే టీవీ షో కు హోస్ట్‌గా తన కెరీర్ ను ప్రారంభించి, ఆ తర్వాత ఒక న్యూస్ ఛానెల్లో రిపోర్టర్‌గా మారాడు. తాజాగా అతడు సకలగుణాభి రామతో సినీ రంగ ప్రవేశం చేశాడు. ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ఇటీవలే రిలీజైంది.