ఇక `పోకిరి` విషయానికి వస్తే, మహేష్‌బాబు ఈ పాత్రకు సరిపోతాడా! లేడా! అనే చిన్న అనుమానం అతని అసిస్టెంట్లు లేవనెత్తారట. అప్పుడు పూరీ బాగా ఆలోచించి. వారికి `ఒక్కడు` సినిమా గురించి చెప్పాడట. ఆ మరుసటి రోజు ఆయనే ఆ సినిమా సీడిని వేసి చూపించాడని యూనిట్ అప్పట్లో చెప్పింది. కట్ చేస్తే మహేష్‌తో, పూరీ పోకిరి స్టోరీ చెప్పడం, దానికి సూపర్‌స్టార్ కృష్ణ వెంటనే ఓకే చేయడం జరిగిపోయాయి. వెంటనే మహేష్ సోదరి మంజున నిర్మాతగా పట్టాలెక్కింది. అది ఆ తర్వాత ఎంత సెన్సెషనల్ హిట్ అయిందో తెలిసిందే. ఇలాంటివి హిట్ అయ్యాక తెలుసుకుంటే భలేగా అనిపిస్తాయి. ఒకప్పుడు దేశముదురు సినిమా అల్లు అర్జున్‌కు ముందు పూరీ జగన్నాథ్, సుమంత్‌కు చెప్పాడట. మరి సుమంత్ తన స్టామినా సరిపోదని తిరస్కరించాడు.
ఇక పోకిరి కాంబినేషన్ మరలా చూడాలని మహేష్ అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. మరలా అంత టైం కలిసి రాలేదని పూరీ చెబుతుండేవారు. ఇప్పుడు చేయాలంటే కాన్సెప్ట్‌లు కొత్తగా వుండాలి. ఇక ఈ విషయం పక్కన పెడితే, ఒక్కో హీరోకు ఒక్కో స్థాయిని పెంచే సినిమాలు వుంటాయి. అందులో మహేష్‌కు పోకిరి ఒకటి. ఈ సినిమా టీవీల్లో ఎన్నిసార్లు వేసినా మరీ మరీ చూడాలనిపించేలా వుంటుంది. ఈ సినిమాను హిందీలో కూడా తీశారు. కానీ తెలుగులో మహేస్‌బాబు చేసినంతగా సల్మాన్ చేయలేకపోయాడని టాక్ వుంది.
అలాగే ఈ సినిమాతోనే హీరోయిన్ ఇలియానాకు కూడా పెద్ద బ్రేక్ వచ్చి తెలుగులో మొట్టమొదటి కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ గా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. అలాగే అత్యధిక భాషల్లో రీమేక్ కాబడిన చిత్రంగా కూడా నిలిచింది. ఈ సినిమాకు మణిశర్మ బాణీలు కూడా ఆకట్టుకున్నాయి. మరి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నట్లు పోకిరి2 ఏదైనా వస్తుందేమో చూడాలి.