థియేటర్లను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వంపై ఉందన్నారు ప్రముఖ సినీ నిర్మాత, ఎపి ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షులు ఎన్.వి.ప్రసాద్. పని ఒత్తిడిలో ఉన్న జాయింట్ కలెక్టర్లను కలిసి తమ సమస్యలను విన్నవించుకుంటే ఉపయోగం ఏముంటుందని ప్రశ్నించారు.
ప్రభుత్వం నియమించిన కమిటీ కాలయాపన చేయకుండా మా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఎవరు పడితే వారు సినీపరిశ్రమల గురించి మాట్లాడవద్దని విజ్ఙప్తి చేశారు. హీరోలు థియేటర్ టిక్కెట్ రేట్లపై స్పందించడం వల్లే ఈ సమస్య వచ్చిందన్నారు. నట్టి కుమార్‌ను తెలంగాణాలో ప్రత్యేక ఛాంబర్‌ను పెట్టుకోమనండి అంటూ మండిపడ్డారు.
మాతో సంబంధం లేకుండా ఆయన్నే ఎన్నికలను పెట్టుకోమనండి. థియేటర్ల టిక్కెట్ల రేట్లపై మరోసారి ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. తిరుపతిలోని సుమారు 25కి పైగా థియేటర్ల యజమానులు, ఎగ్జిబిటర్లు ప్రెస్ మీట్‌కు హాజరయ్యారు.