అక్కినేని నాగచైతన్య.. అక్కినేని నాగేశ్వరరావు మనవడు, నాగార్జున పెద్ద కొడుకు. ఓ వైపు అన్నపూర్ణ స్టూడియోస్... మరో వైపు రామానాయుడు స్టూడియోస్. ఓ తాత లెజెండరీ హీరో, మరో తాత లెజెండరీ ప్రొడ్యూసర్. నాన్న నాగార్జున స్టార్ హీరో. మేనమామ వెంకీ స్టార్ హీరో. అన్నీ వున్నా... అమ్మ చెన్నైలో ఉంటే.. నాన్న హైదరాబాద్‌లో ఉంటారు. అందుచేత నాగ చైతన్య పెళ్లికి ముందు వరకు ఒంటిరిగానే ఉండేవాడు. ఇంట్లో తన పని తనే చేసుకునేవాడు. వంట కూడా తనే చేసుకునేవాడు.
అన్నీ ఉన్నా ఏదో వెలితి. అందుకనే అనుకుంట.. శైలజారెడ్డి ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో చైతన్య మాట్లాడుతూ... అక్కినేని అభిమానులు మా ప్రతి సినిమా ఫంక్షన్‌కి వచ్చి ఇలానే ఎంకరేజ్ చేస్తున్నారు.. మీరే నాకు అన్నీ.. ప్రతి సినిమా మీ అందరికి నచ్చేలా తీస్తాను.. శైలజా రెడ్డి అల్లుడుతో ఒక మంచి సినిమా మనకు మారుతి ఇచ్చారు. సినిమాలో నన్ను చాల కొత్తగా చూపించారు. సెప్టెంబర్ 13న రాబోతున్నాము. ఈ సినిమా మీ అందరికి నచ్చితే పండగ చేసుకుంటాను అన్నారు. అభిమానులనుద్దేశించి మీరే నాకు అన్నీ.. అనడంతో చైతన్య మరోసారి అభిమానులతో పాటు అందరి మనసులు దోచుకున్నాడు.