తమిళ హీరో సూర్య నటిస్తూ.. నిర్మించిన చిత్రం సూరారై పొట్రు. ఈ చిత్రాన్ని తెలుగులో ఆకాశం నీ హద్దురా అనే టైటిల్‌తో రిలీజ్ చేయనున్నారు. కరోనా కారణంగా థియేటర్లు మూసేయడంతో ఈ చిత్రాన్ని ఓటీటీ ద్వారా రిలీజ్ చేయాలి అనుకున్నారు. సూర్య తన సినిమాని థియేటర్లో కాకుండా ఓటీటీలో రిలీజ్ చేయనున్నారని తెలిసినప్పటి నుంచి థియేటర్ ఓనర్స్ సూర్యపై మండిపడ్డారు.
ఎవరు ఏమనుకున్నా... ఎలాంటి విమర్శలు చేసినా సూర్య మాత్రం తన సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యారు. అక్టోబర్ 30న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేసారు. సూర్య తన సహ నిర్మాత గునీత్ మోంగాతో కలిసి ఓటీటీ విడుదల పై నిర్ణయం తీసుకోవడం, విడుదల తేదీని ప్రకటించడం జరిగిపోయింది. అయితే ఈ చిత్రం అనుకున్న టైమ్‌కి అంటే.. అక్టోబర్ 30న ఓటీటీలో విడుదల కావడం లేదు.