ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

ఐవీఆర్

మంగళవారం, 26 నవంబరు 2024 (23:14 IST)
ఏడాది క్రితం ట్వీట్ పెడితే ఇంకెవరో మనోభావాలు దెబ్బతిన్నాయట, ఇప్పుడు కూడా నాలుగు ప్రాంతాల్లో నాలుగు రోజుల వ్యవధిలో వారు కేసులు పెట్టడం ఏంటో అర్థం కావడం లేదంటున్నారు రాంగోపాల్ వర్మ. ఆయన ఓ వీడియో విడుదల చేసారు. అందులో '' నేనేమీ మంచం కింద దాక్కుని ఏడవడం లేదు, వణికిపోవడం లేదు. నేను పోస్టులు పెట్టినవారికి కాకుండా, ఇంకెవరో మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయి?
 
అసలు ఈ కేసులు ఎలా నిలుస్తాయి. ఐతే నాకు చట్టాలపై గౌరవం వుంది. ఆ చట్టం ప్రకారం ఓ సిటిజన్‌గా పాటిస్తాను. నేను సినిమా పనిలో ఉండటం వల్ల స్పందించడం కుదరలేదు. నాకు వచ్చిన నోటీసులకు నేను సమాధానం ఇచ్చాను. ఇదేదో మర్డర్ కేసులా ఇంత తొందర ఎందుకో నాకు అర్థం కావడంలేదు'' అంటూ చెప్పుకొచ్చారు వర్మ.

ఇక్కడ కూడా Logic అడుగుతున్న RGV

అర్జెన్సీ ఏంటి ఈ కేసులో, ఎప్పుడో కదా మార్ఫింగ్ ట్వీట్స్ వేసింది? #RamGopalVarma #RGV pic.twitter.com/RdAGFtZHXT

— M9 NEWS (@M9News_) November 26, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు