మోహన్ బాబు క్షమాపణ చెబుతాడా? విష్ణు ‘మా‘కు రాజీనామా చేస్తాడా?

డీవీ

బుధవారం, 11 డిశెంబరు 2024 (11:05 IST)
Vishnu- mohan babu
సెటబ్రిటీల వ్యక్తిగత గొడవల్లో మీడియా ఫోకస్ చేయడం ఇటీవల పరిపాటి అయింది. పోలీస్ కేసు వరకు వచ్చాక వారు మీడియా దాన్ని ఫోకస్ చేయడం సహజమే. కానీ అంతకుమించి ప్రతీవిషయాన్ని గోరింతలు కొండతలు చేయడం ఎంతవరకు సమంజసం అని కొందరు సినీ ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక ఇది పక్కన పెడితే, గత రాత్రి మోహన్ బాబు ఇంటి దగ్గర కొందరు ప్రముఖులతో కుటుంబ విషయాలను చర్చించేందుకు వస్తున్నారని తెలిసి కొంతమంది మీడియా ఛానల్స్ ప్రతినిధులు గేటుబయట హడావుడి చేయడంతో మోహన్ బాబు నమస్కారం చేస్తూ రావడం వరకు బాగుంది. ఆ తర్వాత విలేకరులు అడిగిన ప్రశ్నకు చిర్రెత్తిన మోహన్ బాబు వారి కెమెరా వైర్ నే లాగి విసిరేయడం జరిగింది. దీన్ని అవమానంగా ఛానల్స్ అసోసియేషన్ భావించి నేడు ఫిల్మ్ నగర్ ఫిల్మ్ ఛాంబర్ దగ్గర నిరసన తెలియజేస్తున్నారు.
 
ఈరోజు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ వద్ద ఫిల్మ్ నగర్ ఫిల్మ్ ఛాంబర్ బయట మోహన్ బాబుకి వ్యతిరేకంగా శాంతియుత నిరసన చేపడుతున్నామని అసోసియేషన్ ప్రకటనలో తెలిపింది.  నిన్న రాత్రి Tv9, మరో యూట్యూబ్ జర్నలిస్ట్‌పై అతని క్రూరమైన దాడిని ఖండిస్తూ తీర్మానాలు పెట్టింది. మోహన్ బాబును మా నుంచి సభ్యత్వం వెంటనే తొలగించాలి. మోహన్ బాబును వెంటనే అరెస్టు చేయాలి మోహన్ బాబు ఇచ్చిన పద్మశ్రీని వెంటనే వెనక్కి తీసుకోవాలి. మోహన్ బాబు యూనివర్సిటీ పై విచారణ చేయాలి. మోహన్ బాబు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా బౌన్సర్లను పెట్టుకొని రౌడీల వ్యవహరిస్తున్న మా చైర్మన్ విష్ణు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి అంటూ నిరసనలో తెలియజేస్తున్నారు. మరి వీరి నిరసన ఎంతమేర ఫలిస్తుందో చూడాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు