బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నా వేదికగా జరిగిన 'పుష్ప-2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు భారీగా అభిమానులు తరలిరావడం, అదీకూడా ఓ తెలుగు హీరో నటించిన చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ పాట్నాలో విజయవంతంగా నిర్వహించడం సంచలనంగా మారింది. అయితే, ఈ ఈవెంట్‌కు వచ్చిన జనసందోహంపై కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను నటించిన తాజా చిత్రం "మిస్ యూ" చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఆయన మాట్లాడారు.
బీహార్ లాంటి చోట అంత క్రౌడ్ రావడం పెద్ద మ్యాటర్ కాదన్నారు. పెద్ద మైదానాన్ని బ్లాక్ చేసి ఈవెంట్‌ను నిర్వహిస్తే ప్రజలు గుమికూడుతారని అన్నాడు. ఒక్క బిర్యానీ ప్యాకెట్, క్వార్టర్ బాటిల్ ఇస్తే రాజకీయ నాయకులక మీటింగ్‌కు జనాలు విపరీతంగా వస్తారని, అలా అని రాజకీయ పార్టీలు గెలుస్తాయా? అని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.