ChadraSeka, Rajamouli, Nitin
నితిన్ ఇప్పుడు దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి నేతృత్వంలో `చెక్` చేశాడు. యేలేటి, రాజమౌళి ఇద్దరూ మంచి స్నేహితులు. చాలామందికి దూరపు బంధుత్వం వుందనుకుంటారు. వీరిద్దరు సినీ ప్రస్తానం ఒకేసారి జరిగింది. ఇదివరకు యేలేటి పబ్లిసిటీకి దూరంగా వుండేవాడు. ఆవిషయంలో రాజమౌళిని ఫాలో అయ్యేవాడు. కానీ పరిస్థితులు మారాక కొన్ని ప్లాప్‌లు వచ్చాక తాను ఏమి చెశానో తెలుసుకున్నాక ఆయన ఐడియా మారింది. ఇకపోతే నితిన్‌తో సినిమా చేయడం అనేది మూడేళ్ళ కిందటి ముచ్చట. అప్పుడు చెప్పిన కథను కాలానుగుణంగా మార్పులు చేసుకుని తెరకెక్కించాడు యేలేటి. నితిన్‌తో 2004లో రాజమౌళి `సై` అంటూ రబ్బీ గేమ్‌ను తెరకెక్కించాడు. అది హిట్ అయింది. 2020లో యేలేటి సినిమా చేస్తున్నప్పుడు కథ, కథనం గురించి రాజమౌళికి చెప్పాడట. అందుకు కొన్ని మార్పులుకూడా ఇచ్చాడని తెలిసింది. ఇద్దరూ మేథావులైన దర్శకులుగా పేరుంది. నితిన్‌తో సై హిట్ ఇచ్చాడు కాబట్టి తాను చెస్ నేపథ్యంలో వచ్చే చెక్‌తో తప్పకుండా హిట్ ఇస్తానంటూ యేలేటి ధీమా వ్యక్తం చేస్తున్నాడు. అందుకు కథలో బలమైన అంశంతోపాటు కథనం ఆసక్తికరంగా వుంటుందని చెబుతున్నారు.