"ఇప్పుడు కాక ఇంకెప్పుడు": సాధినేని యామిని ఫైర్.. సినిమాపై కేసు ఎందుకు?

గురువారం, 5 ఆగస్టు 2021 (08:43 IST)
కాంట్రవర్సిటీలతో పబ్లిసిటీ సంపాదిస్తున్న సినిమా సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా మరో సినిమా సైతం కేవలం వివాదంతోనే సినిమాకు పబ్లిసిటీ తెచ్చుకుంటుంది. అదే "ఇప్పుడు కాక ఇంకెప్పుడు". ఈ సినిమా వస్తున్నట్లు కూడా చాలా మందికి తెలియదు కానీ ఇప్పుడు మాత్రం దీని గురించి సోషల్ మీడియాలో చర్చ బాగానే జరుగుతుంది. మనోభావాలు దెబ్బతీసే విధంగానే ఓ ప్రోమో కట్ చేసి.. ఇప్పుడు అయ్యో అనుకోకుండా జరిగిపోయింది అంటున్నారు. 
 
వాళ్లు నిజమే చెప్తున్నారా లేదంటే అబద్ధమే ఆడుతున్నారా అనేది పక్కనబెడితే ఇప్పటికే ఈ సినిమాకు మంచి పబ్లిసిటీ వస్తుంది. అన్ని మీడియా చానెల్స్ కవర్ చేస్తున్నాయి. ఈ వ్యవహారం కాస్త పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. తాజాగా పొలిటికల్ లీడర్స్ కూడా ఈ సినిమా గురించి చర్చించడం మొదలు పెట్టారు.
 
హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా సినిమాలో సీన్స్, డైలాగ్స్ ఉన్నాయంటూ రచ్చ నడుస్తుంది. ఈ సినిమాపై కేసు నమోదు చేసారు పోలీసులు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల సుమోటో కేసు నమోదైంది. సినిమా ట్రైలర్ హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా ఉందని ఆన్‌లైన్‌లో ఈ సినిమాపై ఫిర్యాదు చేసారు. ఇప్పుడు బిజేపీ మహిళా నేత యామిని సాదినేని కూడా ఇప్పుడు కాక ఇంకెప్పుడు సినిమాపై ఫైర్ అయింది.
 
67 IT యాక్ట్, 295 IPC సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. పాటలు, డైలాగ్స్, సీన్లు హిందు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. కొత్త దర్శకుడు యుగంధర్ ఈ సినిమాను తెరకెక్కించాడు. 
 
ఆగస్ట్ 6న సినిమా విడుదల కానుంది. ట్రైలర్‌లో శృంగార సన్నివేశాలు వస్తున్నపుడు ఆదిశంకరాచార్యులు రాసిన భజగోవిందం అనే బ్యాగ్రౌండ్ స్కోర్ వాడుకున్నారు.. అలా చేసి హిందూ మనోభావాలను దెబ్బతీసారు. ఈ సినిమాపై తాను ఫిర్యాదు చేయబోతున్నానంటూ ట్వీట్ చేసారు యామిని. దాంతో ఇదే కాంట్రవర్సీకి కేంద్రబిందువు అయింది. దీనిపై దర్శకుడు యుగంధర్ మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పాడు.

#IppuduKaakaInkeppudu movie unit has degraded #Hinduism by remixing #bhajagovindam lyrics written by adishankaracharya swamy in a pub location. As a hindu, i am going to file a case against the movie team. Let's all hindus show our power to the movie unit. pic.twitter.com/hSlJcY0uqY

— Yamini Sharma Sadineni (@YaminiSharma_AP) August 4, 2021

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు