యువరాజ్ సింగ్, హాజల్ కీచ్ దంపతులకు వదినమ్మ.. పెళ్ళైన రోజే అప్రమత్తంగా ఉండాలని సూచించింది. స్టార్ బ్యాట్స్‌మెన్ యువరాజ్‌సింగ్, బాలీవుడ్ నటి హాజెల్ కీచ్‌ల వివాహం బుధవారం అట్టహాసంగా జరిగిన నేపథ్యంలో.. ప్రముఖులు యువీ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కానీ యువీ వదిన ఆకాంక్ష శర్మ మాత్రం నవ దంపతులను హెచ్చరిస్తోంది.
ఆకాంక్ష యువరాజ్ సోదరుడు జొరావర్ సింగ్ మాజీ భార్య అయిన ఆమె.. ఇటీవల రియాల్టీ షో బిగ్‌బాస్‌లో పాల్గొంది. ఆకాంక్ష జొరావర్‌ల మధ్య మనస్ఫర్ధలు రావడంతో విడిపోయారు. అయితే తన అత్తగారు షబ్నమ్ కారణంగానే తమ వైవాహికజీవితంలో విభేదాలు వచ్చాయని ఆకాంక్ష ఇదివరకు బిగ్‌బాస్ షోలో వెల్లడించింది. దాంతో షబ్నమ్ ఆకాంక్షపై పరువునష్టం కేసు పెడతానని బెదిరించారు.
తాజాగా యువరాజ్, హాజెల్ కీచ్‌ల వివాహం జరిగిన సందర్భంగా నూతన దంపతులకి ఏం చెప్పాలనుకుంటున్నారు అని మీడియా ప్రశ్నిస్తే.. 'వారి జీవితాల్లో షబ్నమ్ జోక్యం లేకుండా చూసుకోవాలని కోరుకుంటున్నానని తెలిపారు. కీచ్ అదృష్టవంతురాలని.. ప్రతి విషయంలోనూ అమ్మ మాటే వినే మా ఆయనలా కాకుండా యువీలాంటి మంచి వ్యక్తిని వివాహం చేసుకుందని ప్రశంసించింది. ఏదేమైనా యువీ ఢిల్లీలో మూడు రోజులకు మించి ఎప్పుడూ ఉండడులే అంటూ చెప్పుకొచ్చింది. హాజల్ కీచ్ యువరాజ్ సింగ్‌ను తన గుప్పిట్లో పెట్టుకోవాలని చెప్పింది.