మజిలి సినిమా రైట్స్.. అంతా సమంత, చైతూ క్రేజేనా?

బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (16:45 IST)
టాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్ నాగచైతన్య, సమంత.. పెళ్లికి తర్వాత కలిసి నటిస్తున్నారు. మజిలి అనే సినిమా ద్వారా వీరిద్దరూ మళ్లీ భార్యాభర్తలుగా కనిపించనున్నారు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా శాటిలైట్ హక్కులకు భారీ రేటు పలికింది. మజిలీ సినిమాకి ముందు చైతూ సవ్యసాచి చేశాడు. ఈ సినిమా పరాజయం పాలైంది. కానీ సమంతతో మళ్లీ చైతూ కలిసి నటించనుండటంతో చైతూ క్రేజ్ మరింత పెరిగింది. 
 
ఇందులో భాగంగా మజిలీ సినిమా శాటిలైట్ హక్కులను ఆరు కోట్ల రూపాయలకి జీ తెలుగు ఛానల్ వారు కొనుగోలు చేసినట్టుగా సమాచారం. నాగచైతన్యతో పాటు ఈ చిత్రంలో రెండో హీరోయిన్‌గా దివ్యాంశ కౌశిక్ నటిస్తోంది. నిన్నుకోరి తర్వాత శివనిర్వాణ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఈ మజిలి చిత్రం ఇప్పటికే 80 శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. 
 
ఈ చిత్రంలో రావు రమేష్, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. గోపీసుందర్ సంగీతం అందిస్తుండగా.. విష్ణు వర్మ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గరపాటి, హరీష్ పెద్ది మజిలి సినిమాను నిర్మిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు