"శకుని"లో అనుష్క ఫ్రెండ్లీగా చేసిందంతే... కార్తీ

సోమవారం, 25 జూన్ 2012 (19:09 IST)
నటుడు కార్తీ హీరోగా నటించిన 'శకుని'లో ఎస్‌.ఐ.గా అనుష్క కొద్దిసేపు తళుక్కున మెరుస్తుంది. చూడగానే లవ్‌ చేయాలనేట్లున్నాడనే డైలాగ్‌లో అనుష్క హీరోపై పడుతుంది. ప్రముఖ హీరోయిన్‌ చిన్న సీన్‌లో నటించడానికి కారణం గురించి కార్తీ మాట్లాడుతూ... అనుష్క ఫ్రెండ్లీగా నటించింది. 

ఈమేనా హీరోయిన్‌ అనేలా ప్రేక్షకులకు ట్విస్ట్‌ ఇవ్వడానికి కూడా ఉపయోగపడిందని అన్నారు. అందుకనే తర్వాత తాను చేయబోయే చిత్రంలో అనుష్క హీరోయిన్‌గా నటిస్తుందని అన్నారు. ఆ తర్వాత రొమాంటిక్‌ థ్రిల్లర్‌ సినిమాలో చేయబోతున్నా. దానిలో కాజల్‌ నటిస్తోందని కార్తీ చెప్పాడు.

శకుని చిత్రం తమిళ, తెగులో మంచి ఓపెనింగ్స్‌ వచ్చాయని తెలిపారు. మూడు రోజులకే మూడుకోట్లు నైజాంలో వసూలు చేయడం తన గత చిత్రాలకంటే ఎక్కువని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి