తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ పండుగ సంబరాలు రాష్ట్రంలోనే కాకుండా విదేశాల్లోనూ అంబరాన్ని తాకాయి. లాస్ ఏంజల్స్ నగరంలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ సౌత్ కరోలినా (టీఏఎస్సీ) సారథ్యంలో సౌత్ కరోలినాలో బతుకమ్మ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి చిలుముల రామ చంద్రరెడ్డి, ధర్మారెడ్డి, గుమ్మడి దంపతులు, సూర్యారెడ్డి దంపతులు ప్రసంగిస్తూ బతుకమ్మ ప్రాశస్త్యాన్ని వివరించారు.
అదేవిధంగా అమెరికాలోని ఉత్తర కరోలినాలోని డన్ నగరంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానికంగా దొరికే వివిధ రకాల పుష్పాలతో బతుకమ్మలను అలంకరించి, సంప్రదాయ పరంగా బతుకమ్మల చుట్టూ ఆడపడుచులు తిరుగుతూ పాటలు పాడారు.
ఇదిలా ఉండగా, తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మ సంబరాలు సోమవారం ఖమ్మంలో ఘనంగా జరిగాయి. పట్టణంలోని నయాబజార్ హైస్కూల్లో వైభవంగా జరిగిన ఈ సంబరాలకు కేసీఆర్ కుమార్తె అధ్యక్షత వహించారు.
పట్టణంలోని పొట్టిశ్రీరాములు విగ్రహం నుంచి బతుకమ్నల ఊరేగింపు ప్రారంభమై నయాబజార్ హైస్కూల్ వరకు సాగింది. బతుకమ్మల ఊరేగింపునకు ముందు డప్పు వాయిద్యలు, ఒగ్గు కళాకారుల ప్రదర్శనలు, బతుకమ్మ కోలాటాలు, కవితలు చూపరులను ఆకట్టుకున్నాయి.