ఆసియా బుకర్ రేసులో కావేరి నంబిసాన్

గురువారం, 13 నవంబరు 2008 (14:13 IST)
భారతీయ రచయిత్రి కావేరి నంబిసాన్ గురువారం ప్రకటించబోయే ప్రతిష్టాత్మక ఆసియా సాహిత్య అవార్డు రేసులో అందరికంటే ముందువరుసలో ఉన్నారు. వైద్య వృత్తిని వదలిపెట్టిన కావేరి రచయితగా మారారు. ఈమె రాసిన "ద స్టోరీ దట్ మస్ట్ నాట్ బీ టోల్డ్" అనే రచన అవార్డు తుది జాబితాలో చోటు దక్కించుకుంది.

ఈ విషయమై కావేరి మాట్లాడుతూ... డాక్టరయిన తాను రచయితగా నిలదొక్కు కోవాలనుకుంటున్నానని, అందులో భాగంగా ఈ మార్గంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు కూడా సంసిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.

ఇదిలా ఉంటే... ఆసియా బుకర్‌గాలి పిలవబడే ఈ అవార్డును గురువారం బ్యాంకాంగ్‌లో ప్రకటించనున్నారు. కాగా, మరో భారతీయ రచయిత సిద్ధార్థ ధావంత్ రచన్ "లాస్ట్ ఫ్లెమ్మింగోస్ ఆప్ బాంబే" కూడా అవార్డు పోటీలో ఉంది. ఈ పోటీలో విజయం సాధించిన రచనకు పదివేల డాలర్ల ఫ్రైజ్ మనీని అందజేయనున్నారు.

వెబ్దునియా పై చదవండి