అలరించిన కూచిపూడి నృత్యోత్సవం

కూచిపూడి సుమమాల పేరుతో న్యూజెర్సీలో కూచిపూడి నృత్యోత్సవం ప్రేక్షకులను అలరించింది. న్యూజెర్సీలోని నృత్యమాధవి డ్యాన్స్ స్కూల్, గ్లోబల్ టెక్ ఇంక్ సంయుక్తంగా నిర్వహించిన ఈ ఉత్సవంలో దివ్యఏలూరి, వెంపటి రవిశంకర్ ఆధ్వర్యంలో చిన్నారుల నృత్య ప్రదర్శనలు పెద్ద ఎత్తున ఆకట్టుకున్నాయి.

మేడిచర్ల శైలజ, స్వర్ణ రిచ, శ్రీనివాస్, అనిత్రదాస్, సుప్రీత తదితరులు ప్రదర్శించిన శివపాదం, శ్రీకృష్ణ పారిజాతం ప్రేక్షకుల మన్ననలు పొందాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన న్యూజెర్సీ డెప్యూటీ స్పీకర్ చివుకుల ఉపేంద్ర మాట్లాడుతూ... ప్రపంచ దేశాలతో పాటు అమెరికాలో కూచిపూడి నృత్యానికి మంచి ఆదరణ లభిస్తోందని చెప్పారు.

ప్రాచీన భారతీయ కళలకు ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు లభిస్తోందని ఆయన అన్నారు. మనదేశ కళాకారులు ఇటువంటి కార్యక్రమాల్లో ప్రదర్శనలిస్తూ దేశ ప్రతిష్టను చాటుతున్నారని ఉపేంద్ర పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి