ప్రతిభా పాటిల్‌చే అక్షరాస్యతా అవార్డుల ప్రదానం

సోమవారం, 8 సెప్టెంబరు 2008 (20:41 IST)
అంతర్జాతీయ అక్షరాస్యతా దినం సందర్భంగా రాష్ట్రపతి ప్రతిభా దేవీసింగ్ పాటిల్ సోమవారం సత్యేన్ మిత్రా అక్షరాస్యతా అవార్డ్‌ను బహుకరించారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో సంపూర్ణ అక్షరాస్యతా కేంపెయిన్ (టిఎల్‌సి), పోస్ట్ లిటరసీ ప్రోగ్రాం (పిఎల్‌పి), నిరంతర విద్యా ప్రోగ్రాం (సిఇపి) లను అమలుచేసిన జిల్లాలకు రాష్ట్రపతి ఈ అవార్డులను బహుకరించారు.

సంపూర్ణ అక్షరాస్యతా కేంపెయిన్ అవార్డును బిష్ణుపూర్ (మణిపూర్)కు పిఎల్‌పి అవార్డును ఘర్వా (జార్ఘండ్)కు సిఇపి అవార్డును ఝాన్షీ (ఉత్తరప్రదేశ్), సర్గూజా (చత్తీస్‌ఘర్), ఉదయపూర్ (రాజస్తాన్), మెదక్ (ఆంధ్రప్రదేశ్) మరియు బెగుసరాయ్ (బీహార్) లకు ప్రదానం చేశారు.

కొల్‌కతా కేంద్రంగా పనిచేసే ఎన్జీవో సంస్థ బెంగాల్ సోషల్ సర్వీస్ లీగ్‌తో దీర్ఘకాలం సంబంధాలు కొనసాగించిన సుప్రసిద్ధ విద్యావేత్త, ప్రముఖ వయోజన విద్యావేత్త మరియు సామాజిక సంస్కర్త అయిన సత్యేన్ మైత్రా జ్ఞాపకార్థం 1996లో సత్యేన్ మిత్రా మెమోరియల్ లిటలసీ ఆవార్డును నెలకొల్పారు.

స్వచ్ఛంద అధ్యాపకులు మరియు అక్షరాస్యతా పథక నిర్వాహకులు చేసిన నిస్వార్థ సేవను కూడా ఈ అవార్డు గుర్తిస్తుంది. ప్రారంభించిన తర్వాత ఇప్పటివరకూ 39 జిల్లాలు ఈ అవార్డుకు అర్హత సాధించాయి.

వెబ్దునియా పై చదవండి